అల వైకుంఠపురములో అన్ని రికార్డులు

Wednesday,February 05,2020 - 04:30 by Z_CLU

బన్నీ నుంచి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ పోస్టర్ రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఆల్ టైమ్ హిట్ అయిందనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది.

ఈరోజు సక్సెస్ ఫుల్ గా 25వ రోజులోకి ఎంటరైంది అల వైకుంఠపురములో మూవీ. ఈ సందర్భంగా తమ సినిమా అన్ని ఏరియాస్ లో ఆల్ టైమ్ హిట్ అయిందని, నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిందని ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

ఉత్తరాంధ్ర, కృష్ణ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు ఏరియాస్ లో బాహుబలి-1 రికార్డుల్ని కూడా తమ సినిమా క్రాస్ చేసినట్టు ప్రకటించారు మేకర్స్. బాహుబలి-2 తర్వాత రెండో స్థానంలో అల వైకుంఠపురములో సినిమా నిలిచినట్టు ఎనౌన్స్ చేశారు.

ఇక ఓవర్సీస్ తో పాటు నైజాం, సీడెడ్ లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించినట్టు ప్రకటించారు. అంటే.. ఈ ప్రాంతాల్లో బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తర్వాత మూడో స్థానంలో అల వైకుంఠపురములో నిలిచిందన్నమాట.

ఇలా తమ రికార్డుల గురించి చెబుతూనే… ఇప్పటివరకు మహేష్, చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు క్రియేట్ చేసిన నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బ్రేక్ చేసినట్టు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరో 2 వారాలు ఈ సినిమా హవా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.