అఖిల్ మూడో సినిమాపై రూమర్లు

Friday,January 05,2018 - 03:35 by Z_CLU

ఈనెల 10న తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెబుతానని ప్రకటించాడు అఖిల్. అయితే అంతకంటే ముందే అఖిల్ మూడో సినిమాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సత్య పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడంటూ రూమర్లు వస్తున్నాయి.

నిజానికి అఖిల్ లిస్ట్ లో ఒకటి కాదు, రెండు సినిమాలున్నాయి. ఆ రెండు సినిమా డీటెయిల్స్ ను అఖిల్ బయటపెట్టలేదు. వాటిలో ఒక సినిమాను మాత్రం కన్ఫర్మ్ చేసి 10వ తేదీన ప్రకటిస్తానన్నాడు. కానీ ఆ రెండు సినిమాల్లో సత్య పినిశెట్టి మూవీ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి.

ఒకప్పటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కొడుకు, నటుడు ఆది పినిశెట్టి సోదరుడే ఈ సత్య. గతంలో ‘మలుపు’ అనే సినిమాను డైరక్ట్ చేశాడు ఈ కుర్రాడు. అఖిల్-సత్య కాంబోలో రాబోతున్న సినిమాను రానా నిర్మిస్తాడనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.