సూర్య నెక్స్ట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్

Friday,January 05,2018 - 04:31 by Z_CLU

సూర్య ‘గ్యాంగ్’ మూవీ ఈ నెల 12 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే  సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తన నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు సూర్య. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే ఈ సినిమాలో సూర్య సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది సాయి పల్లవి.

సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందనే టాక్ నడుస్తున్నా, సడెన్ గా ఈ ప్లేస్ లో సాయి పల్లవి పేరు వినిపించేసరికి ఫ్యాన్స్ లో చిన్న సైజు కన్ఫ్యూజన్ బిగిన్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్లేస్ లో సాయి పల్లవి రీప్లేస్ అయి ఉంటుందనే డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో గట్టిగానే నడిచాయి. అయితే ఈ కన్ఫ్యూజన్ కి బ్రేక్ వేసింది సినిమా యూనిట్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

 

సూర్య – సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ కాంబో అవడంతో సినిమా సెట్స్ పైకి రాకముందే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాని దీపావళికి  రిలీజ్ చేసే ఆలోచనలో  ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.