రెడీ ఫర్ రిలీజ్

Thursday,November 17,2016 - 02:57 by Z_CLU

నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేపు రిలీజ్ కి రెడీ అయింది. హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ సరసన హేబా పటేల్, నందిత హీరోయిన్లుగా నటించారు. వీళ్లలో ఆత్మ ఎవరు, దెయ్యం ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కార్తికేయ, స్వామిరారా లాంటి విలక్షణ సినిమాలతో తన కెరీర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్న నిఖిల్… ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. వీఐ ఆనంద్ ఈ సినిమాను డైరక్ట్ చేయగా… ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను లాంచ్ చేశారు. ఈవారం థియేటర్లలోకి వస్తున్న సినిమా ఇదొక్కటే కావడం విశేషం.