కొరటాల దర్శకత్వంలో రామ్ చరణ్

Thursday,November 17,2016 - 01:01 by Z_CLU

ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ప్రారంభం కావాల్సింది. ముహూర్తం షాాట్ కూాడా అయిన తర్వాత సినిమా ఆగిపోయింది. అయితే తమ మధ్య ఎలాంటి భేదాాభిప్రాయాలు లేవని, కేవలం స్టోరీలైన్ సెట్ కాకపోవడం వల్లనే సినిమా చేయలేకపోయామని ఈమధ్య కొొరటాల ప్రకటించాడు. ఇప్పుడీ సినిమా మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ తో కొరటాల శివ స్టోరీ డిస్కషన్స్ పూర్తిచేశాడు. ధృవ సెట్స్ లో చెర్రీ-కొరటాాల మధ్య ఈ డిస్కషన్స్ నడిచాయి. ఈసాారి కొరటాల చెప్పిన స్టోరీలైన్ కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ధృవ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే… సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు చెర్రీ. అటు కొరటాల కూడా ఈ గ్యాప్ లో మహేష్ తో మూవీని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత చరణ్-కొరటాల కాంబో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.