ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా...

Thursday,November 17,2016 - 03:58 by Z_CLU

రోబో కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0 ఫస్ట్ లుక్ ఈ ఆదివారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అని సినిమా యూనిట్ జస్ట్ సింపుల్ గా అనౌన్స్ చేయకుండా దానికి ప్రీ లుక్ ని కూడా రిలీజ్ చేయడంతో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2.0 లోగో కింద ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న అక్షయ్ కుమార్ ఉంటే, 2.0 అనే టైటిల్ లో రజినీకాంత్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 కోసం హై ఎండ్ టెక్నాలజీని వాడుతున్న శంకర్, ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం కూడా మాడరన్ టెక్నాలజీని వాడుతున్నాడు. ఫస్ట్ లుక్ తో పాటు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఈ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.

robo-2-0-1