"రాజా ది గ్రేట్" ప్రారంభం

Monday,February 06,2017 - 09:47 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రాజా ది గ్రేేట్ ప్రారంభమైంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్ పై ఈ సినిమా ఉదయం గ్రాండ్ గా లాంచ్ అయింది. నందమూరి కల్యాణ్ రామ్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో రవితేజ ఓ అంధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్స్ బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

raviteja-raja-the-great-zee-cinemalu-1

ఈ సినిమాతో హ్యాట్రిక్ పై కన్నేశాడు అనిల్ రావిపూడి. కల్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు… తాజాగా సాయిధరమ్ తేజ హీరోగా సుప్రీమ్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మాస్ మహారాజ్ సినిమా రాజా ది గ్రేట్ తో సక్సెస్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రవితేజ-దిల్ రాజు కాంబినేేషన్ లో వస్తున్న సినిమా ఇది. గతంలో వీళ్లిద్దరూ కలిసి భద్ర అనే సినిమా చేశారు. మధ్యలో ఓ సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు రాజా ది గ్రేేట్ సినిమాతో మరోసారి దిల్ రాజు-రవితేజ కలిశారు.