విడుద‌లకి ముందే 100 కోట్ల క్ల‌బ్ లోకి...

Monday,February 06,2017 - 10:35 by Z_CLU

సూర్య నటించిన లేటెస్ట్ మూవీ యముడు-3. సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌ జంట‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి 9 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో య‌ముడు, సింగం చిత్రాలను మించి ప్రీరిలీజ్ కే 100 కోట్ల బిజినెస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే సూప‌ర్‌హిట్ అవ్వడంతో పాటు… టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

ఓకే క‌థ‌, క‌థ‌నం, ఓకే ద‌ర్శ‌కుడు, ఓకే హీరో, ఓకే హీరోయిన్ తో ఇలా మూడు పార్టులు రావ‌టం సౌత్ లో ఇదే మెట్ట‌మెద‌టిసారి. అన్ని చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌టం కూడా ఇదే ఫస్ట్ టైం. సూర్య యాాక్టింగ్ తో పాటు.. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే, యాాక్షన్ ఎలిమెంట్స్ ఈ సిరీస్ కు మెయిన్ ఎట్రాక్షన్స్.

singham-yamudu-3-zee-cinemalu-2

నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ఇతర ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.