జీ సినిమాలు (ఫిబ్రవరి 6th)

Sunday,February 05,2017 - 10:46 by Z_CLU

maro-prapancham-zee-cinemalu

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, జమున

ఇతర నటీనటులు : జమున, గుమ్మడి, పద్మనాభం, సాక్షి రంగారావు, మాడ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగేశ్వర రావు, ఆదుర్తి సుబ్బారావు

రిలీజ్ డేట్ : 10 ఏప్రిల్ 1970

సమాజం బాగుపడాలన్నా, తరవాతి తరాలు సమానత్వంతో బతకాలన్నా, కుల, మత, జాతి లాంటి వైషమ్యాలు లేని మరో ప్రపంచాన్ని సృష్టించాలనుకున్న యువత ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు..? ఎదురైనా ఇబ్బందులను ఎదుర్కున్నారు..? చివరికి ఏమైంది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. K.V. మహదేవన్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

mande-gundelu-zee-cinemalu

నటీ నటులు : కృష్ణ, శోభన్ బాబు, చంద్ర మోహన్, అంజలి దేవి, గుమ్మడి, జయసుధ, మాధవి, జయప్రద

మ్యూజిక్ డైరెక్టర్ : కె.వి. మహదేవన్

డైరెక్టర్ : కె. బాపయ్య

నిర్మాత : రామానాయుడు

రిలీజ్ డేట్ : జనవరి 1, 1979

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న శారద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో తన కొడుకు కళ్యాణ్ తప్పిపోతాడు. ఆ తరవాత అనుకోని పరిస్థితుల్లో అంజలి కొడుకు కళ్యాణ్ గా శారదకు దగ్గరవుతాడు. అసలు కళ్యాణ్ ఏమైనట్టు..? ఇంతకీ శారద తన కన్న కొడుకును చేరుకుంటుందా లేదా..? అనే అతి సున్నితమైన అంశంతో  తెరకెక్కింది మండే గుండెలు.  బాపయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ని రామానాయుడు గారు నిర్మించారు.

=============================================================================

devatha-zee-cinemalu

నటీనటులు – శోభన్ బాబు, శ్రీదేవి

ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

===========================================================================

hanumanthu-zee-cinemalu

నటీ నటులు : శ్రీహరి, మధు శర్మ, KR విజయ

ఇతర నటీనటులు : విజయ్ చందర్, రంగనాథ్, ప్రదీప్ రావత్, పింకీ సర్కార్, మానస, దేవి శ్రీ, LB శ్రీ రామ్, కొండవలస, వేణు మాధవ్, కోవై సరళ

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : చంద్ర మహేష్

ప్రొడ్యూసర్ : శాంత కుమారి

శ్రీహరి హీరోగా తెరకెక్కిన హనుమంతు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన పక్కా హిట్ ఫార్ములా తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్. పల్లెటూరిలో ఉండే ఒక సాధారణ వ్యక్తి, తన గతం తెలుసుకుని, తన తండ్రి చావుకు కారణమైన వారికి బుద్ధి చెప్పి, సగంలోనే సమసిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం కోసం పోరాడే కొడుకుగా, ఫ్లాష్ బ్యాక్ లో స్వాన్త్రం కోసం పోరాడే యోధుడిగా అద్భుతంగా నటించాడు శ్రీహరి. ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ప్రాణం.

===========================================================================

action-3d-zee-cinemalu

నటీ నటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

==========================================================================

seetha-ramula-kalyanam-lankalo-zee-cinemalu

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

============================================================================

viyyala-vari-kayyalu-ze-cinemalu

నటీనటులు : ఉదయ్ కిరణ్, శ్రీహరి, నేహ జుల్క

ఇతర నటీనటులు : వేణు మాధవ్, సాయాజీ షిండే, కౌసల్య, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : E. సత్తిబాబు

ప్రొడ్యూసర్ : L. శ్రీధర్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2007

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, రియల్ స్టార్ శ్రీహరి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వియ్యాల వారి కయ్యాలు’. ఫ్యాక్షనిస్టుల మధ్య ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారు అన్నదీ ఈ సినిమా ప్రధాన కథాంశం. రమణ గోగుల మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్.