Raviteja Dhamaka - మాస్+క్లాస్ చూపించిన మాస్ రాజా

Saturday,October 16,2021 - 04:02 by Z_CLU

RaviTeja Trinadha Rao Nakkina Movie Titled as Dhamaka

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. క్రాక్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫాంలోకి వచ్చారు. ప్రస్తుతం రవితేజ వరుస  ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు.  రవితేజ కెరీర్‌లో 69వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు  త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. ఆయన సినిమాల్లో ఎంతటి వినోదం ఉంటుందో అందరికీ తెలిసిందే. దసరా కానుకగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్‌ ఇచ్చారు చిత్రయూనిట్.

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీకి ధమాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ధమాకా అంటే అందరికీ తెలిసిందే. టైటిల్‌లోనే మంచి ఎనర్జీ కనిపిస్తోంది. నిజంగానే బ్లాస్ట్ అయ్యేలా ఉంది. రవితేజకు ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇక  డబుల్ ఇంపాక్ట్ అనేది క్యాప్షన్.

raviteja dhamaka movie

దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రవితేజ  స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ ఉండటం, ఆయన  మొహంలో ఏదో తెలియని కథను చెప్పేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది వరకు ఎన్నడూ  కూడా చూడని రవితేజను చూడబోతోన్నట్టు తెలుస్తోంది.

రవితేజ కెరీర్‌లో ఇదొక విభిన్న చిత్రంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్‌ను బట్టే తెలుస్తోంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

రచయిత, దర్శకుడు : త్రినాథరావు నక్కిన
నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
స్టోరీ, డైలాగ్స్ : ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం : భీమ్స్ సిసిరిలియో
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో : వంశీ-శేఖర్

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics