డబ్బింగ్ టైటిల్ తో రవితేజ!

Tuesday,August 11,2020 - 12:34 by Z_CLU

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో KRACK సినిమా చేస్తున్న మాస్ మహారాజ్ RaviTeja తన నెక్స్ట్ మూవీని దర్శకుడు రమేష్ వర్మ తో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు తాజాగా ‘కిలాడి’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అనే టాక్ ఉంది.

Khiladi అనేది డబ్బింగ్ సినిమాల టైటిల్. కొన్నేళ్ళ క్రితం కమల్ హాసన్ తమిళ్ సినిమాను ఇదే టైటిల్ తో తెలుగులో అనువదించి విడుదల చేశారు. ఆ మధ్య విశాల్ కూడా ఈ టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అంతెందుకు.. తెలుగు, తమిళ్ నుంచి ఏ సినిమా హిందీలోకి డబ్బింగ్ అయినా దానికి ఖిలాడీ అనే టైటిల్ తగిలించేయడం ఆనవాయితీ.

అలా డబ్బింగ్ టైటిల్స్ కు కేరాఫ్ గా మారిన ఖిలాడీ పేరును రవితేజ సినిమాకు పెట్టబోతున్నారట. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. రాశీ ఖన్నా (Raashi Khanna), నిధి అగర్వాల్ (Nidhi Agerwal)ను హీరోయిన్స్ గా తీసుకున్నారు.

గతంలో రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్ లో ‘వీర’ అనే సినిమా వచ్చింది. ఆశించిన ఫలితం దక్కలేదు. ఈసారి ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.