#AKHIL5 అంతా రెడీ

Tuesday,August 11,2020 - 01:08 by Z_CLU

సినిమా సినిమాకు మధ్య చిన్న చిన్న గ్యాప్స్ తీసుకుంటూ వస్తున్న అఖిల్ ఈసారి మాత్రం కాస్త స్పీడ్ పెంచాడు. ఓవైపు Most Eligible Bachelor సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Surender Reddy డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు Akhil. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని సమాచారం.

‘Syeraa’ తర్వాత ఓ యూత్ ఫుల్ కథను రెడీ చేసిన సురేందర్ రెడ్డి అఖిల్ కి స్క్రిప్ట్ చెప్పడం, అఖిల్ తో పాటు నాగార్జున కి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఈ సినిమాతో నిర్మాతగా కూడా మారే ఉద్దేశంలో ఉన్నాడు సురేందర్ రెడ్డి. మరో దర్శకుడు క్రిష్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తాడట.