Raviteja Khiladi - వాయిదా పడింది

Wednesday,May 05,2021 - 02:53 by Z_CLU

కోవిడ్ 19 సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇటివలే చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’ లతో పాటు మరికొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా రవితేజ నటించిన ‘ఖిలాడి’ కూడా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని అన్ని చక్కబడ్డాక కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా ఈ నెల 28న థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. ఈ మేరకూ షూటింగ్ కూడా జెట్ స్పీడులో చేశారు. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం , థియేటర్స్ మూసివేత కారణం చేత వరుసగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. మళ్ళీ అన్ని చక్కబడితే కానీ థియేటర్స్ ఓపెన్ అవ్వవు. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా సినిమాలు రిలీజ్ ఉండకపోవచ్చు. ఓపెన్ అయ్యాక కూడా కొంత టైం పడుతుంది. ఈ లోపు పరిస్థితులు నార్మల్ అవ్వాలి. ఎంత లేదన్నా రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే జూన్ ఎండింగ్ లేదా జులై లో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

– KHILADI Teaser కోసం క్లిక్ చేయండి

రమేష్ వర్మ డైరెక్షన్ రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి , మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యాక్షన్ క్రైం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటివలే విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. హవీష్ ప్రొడక్షన్స్ బేనర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics