కేరళ లో హాలీడే స్పెండ్ చేస్తున్న రామ్ చరణ్

Friday,October 06,2017 - 01:27 by Z_CLU

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ పక్కా ప్లాన్డ్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన సినిమా యూనిట్, వన్ వీక్ హాలీడేస్ తరవాత మళ్ళీ సెట్స్ పైకి రానుంది. అయితే ఈ వారం రోజులు కేరళలో స్పెండ్ చేయనున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

కేరళలోని నేచర్ క్యూర్ స్పా లో వారం రోజులు టైమ్ స్పెండ్ చేయనున్న రామ్ చరణ్, ఆ తరవాత హైదరాబాద్ లో జరగనున్న రెగ్యులర్ షూటింగ్ కి అటెండ్ అవుతాడు. మ్యాగ్జిమం నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. సుకుమార్  డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సమాంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.