Raviteja Balakrishna - బాలయ్య టైటిల్ తో రవితేజ

Wednesday,July 14,2021 - 10:23 by Z_CLU

మాస్ మహారాజా నెక్స్ట్ సినిమాకు సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో రవితేజ నటిస్తున్న సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ తో బాలకృష్ణ కి కొన్నేళ్ళ క్రితం స్క్రిప్ట్ చెప్పాడు అనిల్ రావిపూడి. తండ్రి పేరుతో బాలయ్య సినిమా అని వార్త బయటికి రాగానే అందరిలో ఆసక్తి రేకెత్తించింది. కట్ చేస్తే ఆ సినిమా డిస్కషన్ స్టేజిలోనే ఉండిపోయింది. ఇటివలే బాలయ్య -అనిల్ రావిపూడి కాంబో అని మళ్ళీ ప్రచారం మొదలయింది. దానికి రామారావు టైటిల్ నే పెడతారని అనుకున్నారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ని రవితేజ తన నెక్స్ట్ సినిమాకు పెట్టేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది.

raviteja ramarao on duty movie 3

నిజానికి రామారావు అనేది క్యాచీ టైటిల్ పైగా తండ్రి పేరు కూడా అందుకే బాలయ్య అప్పట్లో ఈ టైటిల్ కి ఓకె అనేసి స్క్రిప్ట్ విన్నారు. కానీ ఎందులో ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ లోపు టైటిల్ అవైలేబుల్ ఉండటంతో దర్శకుడు శరత్ మండవ రవితేజ కి ఈ టైటిల్ సజిస్ట్ చేసాడట. కథకి , క్యారెక్టర్ కి యాప్ట్ టైటిల్ అవ్వడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట రవితేజ.

anil ravipudi balakrishna zeecinemalu

ఏదేమైనా బాలయ్య టైటిల్ తో రవితేజ సినిమా చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. తండ్రి పేరుతో క్యాచీ గా ఉండే ఈ టైటిల్ ని బాలయ్య ఎందుకు వదులుకున్నాడని నందమూరి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి రవితేజ ఈ టైటిల్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics