#Jersey కాంబో రిపీట్ ?

Wednesday,July 14,2021 - 10:49 by Z_CLU

టాలీవుడ్ లేటెస్ట్ క్లాసిక్స్ లో ‘జెర్సీ’ ఒకటి. ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అందుకే మళ్ళీ ఈ కాంబో రిపీట్ చేసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత వంశీ. ఇక నాని , గౌతం కి మంచి బాండింగ్ ఏర్పడింది. నేచురల్ స్టార్ తక్కువ టైంలో ఓకె చేసిన కథ జెర్సీనే. ఆ సినిమా టైంలోనే వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు.

ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ తో పాటు ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ఇంకో రెండు సినిమాలు కమిట్ మెంట్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక గౌతం ‘జెర్సీ’ ని హిందీలో షాహిద్ కపూర్ తో తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూట్ పూర్తయింది. కానీ గౌతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత గౌతం NVR సినిమా బేనర్ లో నిర్మాత NV ప్రసాద్ కి ఒక సినిమా చేయాల్సి ఉంది.

ప్రస్తుతానికి ఇటు నాని అటు గౌతం ఇద్దరు బిజీగానే ఉన్నారు. అయితే ఈ కాంబోలో సినిమా అయితే కన్ఫర్మ్. కానీ అదెప్పుడు మెటిరియలైజ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా జెర్సీ కాంబోలో మరో సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్ భారీ స్థాయిలో ఉంటాయి. వాటిని అందుకునేలా నాని , గౌతం అదిరిపోయే స్క్రిప్ట్ రావాల్సి ఉంటుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics