డిసెంబర్ నుండి నాగ్ కొత్త సినిమా !

Thursday,November 14,2019 - 02:28 by Z_CLU

‘మన్మథుడు 2’ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన నాగార్జున ఎట్టలేలకు తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ప్రస్తుతం నెక్స్ట్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. వంశీ పైడిపల్లి దగ్గర ‘ఊపిరి’,’మహర్షి’ సినిమాలకు రచయితగా పనిచేసిన సొలొమాన్ చేయబోతున్నాడు నాగ్. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. మిగతా ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

తాజాగా అక్కినేని అవార్డ్స్ గురించి ఓ ప్రెస్ మీట్ పెట్టిన నాగ్ అక్కడే తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పాడు. డిసెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఆ సినిమా ఎవరితో అనేది మాత్రం ప్రకటించలేదు. కానీ నెక్స్ట్ సినిమా సోలోమాన్ ఫిక్స్ అనేది మాత్రం బయటికి వచ్చేసింది. ఈ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాను సెట్స్ పై పెట్టి 2021 సంక్రాంతి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు కింగ్.