"ప్రతిరోజు పండగే" షూటింగ్ అప్ డేట్స్

Thursday,November 14,2019 - 12:01 by Z_CLU

సాయితేజ్, మారుతి కాంబోలో వస్తున్న సినిమా ప్రతిరోజూ పండగే. కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ పాటను అందమైన లొకేషన్ లో చిత్రీకరించనున్నారు.

నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2, యూవీ పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల్ని అమెరికాలో షూట్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు… ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు.

నటీనటులు:
సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను