తెలంగాణ అమ్మాయిగా రష్మిక

Wednesday,May 16,2018 - 12:06 by Z_CLU

ఫిదాలో తెలంగాణ యాసలో మాట్లాడి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది హీరోయిన్ సాయిపల్లవి. ఇప్పుడు మరోసారి అదే యాంగిల్ ను రిపీట్ చేయబోతోంది మరో హీరోయిన్ రష్మిక. తన అప్ కమింగ్ మూవీలో ఈమె కూడా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడబోతోంది.

విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించనుంది రష్మిక. ఇంకా సెట్స్ పైకి రాని ఈ సినిమాలో ఆమె క్రికెటర్ గా కనిపించబోతోంది. తెలంగాణ మహిళ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే పాత్రలో కనిపించనుంది. ఈ క్యారెక్టర్ కోసం ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్న రష్మిక, క్రికెట్ పాఠాలతో పాటు తెలంగాణ యాస కూడా నేర్చుకునే ప్రయత్నంలో ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్, BIG Ben సినిమా బ్యానర్స్  పై భరత్ కమ్మ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానుంది ఈ సినిమా. రీసెంట్ గా మలయాళంలో దుల్కర్ సల్మానే చేసిన కామ్రేడ్ ఇన్ అమెరికా (సీఐఏ)కు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది సినిమా యూనిట్.