క్వశ్చన్స్ రేజ్ చేస్తున్న ‘నా నువ్వే’ ట్రైలర్

Wednesday,May 16,2018 - 12:52 by Z_CLU

మే 25 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘నా నువ్వే’ మూవీ. ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన ఫిల్మ్ మేకర్స్, ఆడియెన్స్ లో ‘నా నువ్వే’ సినిమా భారీ స్థాయిలో రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జయేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజయింది. మొత్తం 1:40 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, కళ్యాణ్ రామ్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తుంది.

ఈ ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ క్లియర్ గా రివీల్ కాలేదు కానీ లవ్ ని అస్సలు నమ్మని యంగ్ స్టర్ లా కనిపించానున్నాడని అర్థమవుతుంది. ఇక తమన్నా విషయానికి వస్తే కంప్లీట్ గా ఆపోజిట్ రోల్. RJ లా కనిపించనున్న తమన్నా కళ్యాణ్ రామ్ ని సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయిలా మెస్మరైజ్ చేయనుంది.

‘తపించే క్షణాలకు నిరాశే చూపించకు…’ అనే లైన్, సినిమాలోని ఇమోషనల్  ఆంగిల్  ని  ఎలివేట్ చేస్తుంది. ఇంతకీ తమన్నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా..? అసలు కళ్యాణ్ రామ్ బ్యాక్ స్టోరీ ఏంటి..? అనే క్వశ్చన్స్ ని రేజ్ చేస్తుంది ‘నా నువ్వే’ ట్రైలర్.

P.C. శ్రీరామ్ విజువల్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శరత్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. జయేంద్ర  డైరెక్టర్.