మే 20న ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు..?

Wednesday,May 16,2018 - 11:20 by Z_CLU

ఇప్పుడు అందరి ఫోకస్ ఆ తేదీపైనే. అందరి చూపు యంగ్ టైగర్ పైనే. ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. అది ఏటా వచ్చేదే. సంబరాలు కూడా వెరీ కామన్. కానీ ఆరోజున ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ను ఎనౌన్స్ చేసే చాన్స్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. చెర్రీ-ఎన్టీఆర్ హీరోలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆమధ్య కాలిఫోర్నియాలో ఎన్టీఆర్-చరణ్ మధ్య జరిగిన టెస్ట్ కట్ స్టిల్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు మరికొంతమంది. అందుకే మే 20 కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిటింగ్.