అక్టోబర్ కు వాయిదాపడిన రాజుగారి గది-2?

Wednesday,July 19,2017 - 11:20 by Z_CLU

నాగ్ లేటెస్ట్ మూవీ రాజుగారి గది-2 సినిమా అక్టోబర్ కు వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. తన సినిమాల క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడని నాగార్జున.. గ్రాఫిక్స్ కోసం మరింత టైం తీసుకోవాలని అనుకున్నారట. అందుకే రాజుగారి గది-2 సినిమాను ఆగస్ట్ నుంచి అక్టోబర్ కు వాయిదా వేసినట్టు టాక్.

నిజానికి రాజుగారి గది-2 సినిమా చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకుంది. సినిమా రష్ మొత్తం ఓసారి చూసిన నాగార్జున, మరికొన్ని సన్నివేశాల్ని షూట్ చేశారు. ఔట్ పుట్ బాగా రావడంతో గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే మూవీని వాయిదా వేశారు.

తాజాగా నిర్ణయంతో మూవీ బడ్జెట్ కాస్త పెరుగుతున్నప్పటికీ మంచి అవుట్ పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో యూనిట్ అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో నాగ్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో సమంత కనిపించనుంది. కాజల్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేసిందనే వార్త వినిపిస్తున్నప్పటికీ అదింకా కన్ ఫర్మ్ కాలేదు.