F3 Movie - రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,January 28,2021 - 06:29 by Z_CLU

2019 సంక్రాంతికి నవ్వులు పూయించిన F2 మూవీ.. ఈ ఏడాది సీక్వెల్ తో మరిన్ని నవ్వులు పంచడానికి రెడీ అయింది. ఇప్పుడీ ఆనందాన్ని రెట్టింపు చేసేలా రిలీజ్ డేట్ ప్రకటించింది యూనిట్. ఆగస్ట్ 27న F3 సినిమా థియేటర్లలోకి రానుంది.

బ్లాక్ బస్టర్ హిట్టయిన F2 సినిమాకు సీక్వెల్ గా వస్తోంది F3. సీక్వెల్ ను మరింత ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో నింపేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తున్నాడు కూడా.

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. 30 నుంచి మరో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

వెంకటేష్-తమన్న, వరుణ్ తేజ్-మెహ్రీన్ జంటలు ఆగస్ట్ 27న ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఫుల్లుగా ప్రిపేర్ అయిపోయారు. గెట్ రెడీ..