రానా, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో సినిమా?

Sunday,March 10,2019 - 12:30 by Z_CLU

‘C/O కంచరపాలెం’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన రానా ఇప్పుడు పూర్తి స్తాయి నిర్మాతగా మారబోతున్నాడట. ఆ మధ్య అక్షయ్ కుమార్ తో కలిసి తెలుగులో ఓ రీమేక్ సినిమా ప్లాన్ చేసిన రానా ఇప్పుడు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరాఠిలో సూపర్ హిట్టైన ‘పోస్టర్ బాయ్స్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడని సమాచారం.

అయితే  రానా ఈ సినిమాను అక్షయ్ కుమార్ తో కలిసి నిర్మించనున్నాడా..లేదా సోలోగానే ప్రొడ్యూస్ చేస్తాడా.. అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు కానీ… త్వరలోనే రానా తన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా అనౌన్స్ చేయనున్నాడని టాక్.