వరుణ్ తేజ్ సినిమాలో తమిళ్ హీరో?

Sunday,March 10,2019 - 03:01 by Z_CLU

హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘వాల్మీకి’ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.. తమిళ్ లో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’కి రీమేక్ తెరకెక్కుతోందీ సినిమా. ఈ సినిమాలో  నెగిటీవ్ షెడ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. సినిమాలో మరో హీరో కోసం టాలీవుడ్ లో కొంత మంది హీరోలను అనుకున్న మేకర్స్ లేటెస్ట్ గా తమిళ హీరో అధర్వను ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది.

ఈ రోల్ కోసం ఇటివలే స్నేహ భర్త ప్రసన్న ని కూడా సంప్రదించారని, చివరికి అధర్వ ను ఫైనల్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే  వాల్మీకి సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడట ఈ తమిళ్ హీరో.