రానా న్యూ లుక్.. రూమర్స్ కు చెక్

Thursday,August 22,2019 - 01:43 by Z_CLU

ప్రస్తుతం అమెరికాలో కోలుకుంటున్నాడు రానా. తన హెల్త్ కండిషన్ పై వస్తున్న రూమర్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న ఈ హీరో, తాజాగా మరో ఫొటో రిలీజ్ చేశాడు. కొత్త స్టిల్ లో కంప్లీట్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు రానా.

ప్రస్తుతం ఈ హీరో లాస్ ఏంజెల్స్ లో ఉన్నాడు. ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడు. ఈ గ్యాప్ లో తనపై వస్తున్న రూమర్లకు ఇలా కొత్తకొత్త ఫొటోలతో చెక్ పెడుతున్నాడు. మరోవైపు ఇండస్ట్రీలో అప్ డేట్స్ పై కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.

సెప్టెంబర్ లో హైదరాబాద్ కు రానున్నాడు రానా. వచ్చిన వెంటనే వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. హాథీ మేరీ సాధీ సినిమాను దాదాపు కంప్లీట్ చేశాడు.