పూరి-విజయ్ మూవీ టైటిల్ ఫిక్స్?

Thursday,August 22,2019 - 12:55 by Z_CLU

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను పెట్టబోతున్నారు. అఫీషియల్ స్టేట్ మెంట్ మాత్రం రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు పూరి జగన్నాధ్. విజయ్ దేవరకొండకు దాదాపు స్టోరీ మొత్తం నెరేట్ చేసిన పూరి, స్క్రీన్ ప్లేకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ స్టయిల్ లోనే కంప్లీట్ మాస్ మాసాలా ఎలిమెంట్స్ తో రాబోతోంది ఫైటర్.

ఇస్మార్ట్ శంకర్ లో రామ్ హైదరాబాదీగా కనిపించినట్టుగానే, కొత్త సినిమాలో విజయ్ దేవరకొండ కూడా హైదరాబాద్ కుర్రాడిలా కనిపించబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి.