రానా ఇప్పుడు వార్ స్టార్ అయ్యాడు...

Saturday,February 18,2017 - 12:16 by Z_CLU

ఇండస్ట్రీలో మెగాస్టార్ నుంచి రెబల్ స్టార్ వరకు చాలామంది స్టార్స్ ఉన్నారు. హీరోలకు వాళ్లు నటించిన సినిమాలే ఇమేజ్ తెచ్చిపెడతాయి. వాళ్లకు ఓ ట్యాగ్ లైన్ ఇస్తాయి. ఇప్పుడు యంగ్ హీరో రానా కూడా అలాంటి గుర్తింపే తెచ్చుకున్నాడు. తన లేేటెస్ట్ మూవీతో రానా ఇప్పుడు వార్ స్టార్ అనిపించుకున్నాడు.

రానా లేటెస్ట్ మూవీ ఘాజీ. రానా నేవీ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై, అన్ని ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. భారతీయ సినీచరిత్రలోనే ఇప్పటివరకు చూడని కథాశంతో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా, రానాకు వార్ స్టార్ అనే ఇమేజ్ తీసుకొచ్చింది. లెఫ్టినెంట్ కమాండర్ గా రానా తన పెర్ఫెర్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ వర్మ అనే క్యారెక్టర్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు.

ఘాజీ సినిమా సక్సెస్ తో రానా ఆనందం డబుల్ అయింది. తనకు ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు రానా థ్యాంక్స్ చెప్పాడు. పనిలోపనిగా తన తాత, మూవీ మొఘల్ రామానాయుడును తలుచుకున్నాడు. ఈరోజు రామానాయుడు వర్థంతి. ఈ సందర్భంగా, తాతగారితో ఉన్న చిన్నప్పటి ఫొటోను షేర్ చేసిన రానా.. ఘాజి హిట్ అయినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.