రిలీజ్ కి రెడీ.....

Saturday,February 18,2017 - 01:45 by Z_CLU

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విన్నర్’ రిలీజ్ కి రెడీ అవుతుంది.. గోపి చంద్ మలినేని దర్శకత్వం లో యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల శివరాత్రి సందర్భంగా 24 న రిలీజ్ కానుంది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికెట్ అందుకోవడంతో ఇక థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు సుప్రీమ్ హీరో..

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో గ్రాండ్ హిట్ సాధించిన ‘సుప్రీమ్’ తర్వాత వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీ రోల్ పోషించారు.. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాతో తేజ్ ఎలాంటి హిట్ సాదిస్తాడో..చూడాలి…