మరికొన్ని గంటల్లో రంగస్థలం ట్రయిలర్

Sunday,March 18,2018 - 08:56 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం హంగామా ఈరోజు పీక్స్ కు చేరబోతోంది. సాయంత్రం విశాఖలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను భారీ ఎత్తున చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ ను కూడా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం రంగస్థలం ట్రయిలర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాబోతోంది.

ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మరో 2 బ్రాండ్ న్యూ పోస్టర్లు విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా మార్చి 30న గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో ఇప్పటికే పెద్ద హిట్ అయింది.