ఉగాది స్పెషల్: నేల టిక్కెట్టు ఫస్ట్ లుక్

Sunday,March 18,2018 - 09:05 by Z_CLU

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘‘సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, ‘రాజా ది గ్రేట్‌’తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ని తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా విడుదల చేశారు.

’నేల టిక్కెట్టు’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ ఫస్ట్‌లుక్‌లో రవితేజ మంచి ఎనర్జీతో కనిపిస్తూ.. టైటిల్ కు తగ్గట్టు సి-క్లాజ్ జనాలతో కలిసి టీ తాగుతున్నాడు. అలాగే టైటిల్ కింద రూ. 10 చూపిస్తున్న నేల టిక్కెట్టుని బాగా డిజైన్ చేశారు.

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫిదా’ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.