నాని క్లారిటీ ఇచ్చేదెప్పుడో?

Sunday,March 18,2018 - 08:30 by Z_CLU

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసాడు కూడా.. ఇక త్వరలోనే నాగార్జున తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న విషయం కూడా తెలిసిందే.

కాని ఈ సినిమా తర్వాత నాని చేయబోయే సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఈ యంగ్ హీరో .. ఇప్పటికే నాని నెక్స్ట్ సినిమా లిస్టు లో విక్రం కుమార్, హను రాఘవపూడి, అవసరాలతో పాటు మరో కొత్త దర్శకుడి పేరు కూడా వినిపిస్తుంది. వీరిలో నాని ఎవరితో ముందుగా సినిమా చేస్తాడనే మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

లేటెస్ట్ గా వీరి ముగ్గురిలో నాని ముందుగా అవసరాల తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ సినిమాపై ఎన్ని వార్తలొస్తున్నా నాని మాత్రం ఈ విషయం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఈ నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చేదెప్పుడో.