రంగస్థలం ట్రయిలర్ రివ్యూ

Monday,March 19,2018 - 11:10 by Z_CLU

1980ల నాటి కథతో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుందంటూ చాన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. పొలిటికల్ టచ్ ఉండడం కాదు, రంగస్థలం సినిమాలో ఉన్నదే రాజకీయం. మధ్యలో లవ్, విలనిజం యాడ్ చేశారు. తాజాగా రిలీజైన ట్రయిలర్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది.

రంగస్థలం ట్రయిలర్ మొత్తం రామ్ చరణ్ వన్ మేన్ షో కనిపించింది. ఫుల్ గా గడ్డం పెంచిన అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా చరణ్ ఆకట్టుకున్నాడు. టీజర్ ను చిట్టిబాబు పాత్ర పరిచయానికే పరిమితం చేసిన యూనిట్, ట్రయిలర్ లో మాత్రం చిట్టిబాబు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి క్యారెక్టర్ పవరేంటనే విషయాన్ని ఎలివేట్ చేశారు. మరీ ముఖ్యంగా కోస్తా యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ టోటల్ ట్రయిలర్ కే హైలెట్.

రంగస్థలం ట్రయిలర్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ జగపతిబాబు. 80ల నాటి సర్పంచులు, వాళ్ల దోపిడీని జగపతిబాబు పాత్రతో కళ్లకుకట్టినట్టు చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక సినిమాలో కీలకమైన ఇతర సమంత, ప్రకాష్ రాజ్, ఆదిలను కూడా ట్రయిలర్ తో పరిచయం చేశారు.

ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతోంది, అందులో ఏం చూపించబోతున్నామనే విషయాన్ని రంగస్థలం ట్రయిలర్ తో క్లియర్ గా చెప్పేశాడు దర్శకుడు సుకుమార్. దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, రామకృష్ణ ఆర్ట్ వర్క్ ట్రయిలర్ లో కొట్టొచ్చినట్టు కనిపించాయి. మూవీపై ఇప్పటికే ఉన్న అంచనాల్ని డబుల్ చేసింది రంగస్థలం ట్రయిలర్.