నెక్ట్స్ సినిమా కోసం చెర్రీ మేకోవర్

Tuesday,December 20,2016 - 09:05 by Z_CLU

తన ప్రతి సినిమాకు ఓ కొత్త లుక్ ట్రైచేయడం రామ్ చరణ్ కు ఇష్టం. లుక్ లో కొత్తదనం చూపించినప్పుడే సినిమాలో కిక్ ఉంటుందని నమ్ముతాడు ఈ మెగాపవర్ స్టార్. అందుకే ధృవ సినిమా కోసం ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించాడు. ఇప్పుడు పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు సరికొత్తగా ముస్తాబవ్వడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు చరణ్. సుకుమార్ సినిమాల్లో హీరో ఎంత విలక్షణంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో.. చరణ్ కూడా సుక్కూ మూవీలో సంథింగ్ స్పెషల్ గా కనిపించబోతున్నాడని టాక్.

తాజా సమాచారం ప్రకారం… తన అప్ కమింగ్ మూవీలో రామ్ చరణ్, గుబురు గడ్డంతో కనిపిస్తాడని తెలుస్తోంది. కథ ప్రకారం పల్లెటూరి ఛాయలు ఉంటాయి కాబట్టి… హీరోకు పెద్దగడ్డం ఉంటే బాగుంటుందని సుకుమార్ సూచించాడట. అలా చెర్రీ ఈసారి గడ్డంతో కనిపించనున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చరణ్ ఏ సినిమాలోనూ పెద్ద గడ్డంతో కనిపించలేదు. సో.. సుకుమార్ సినిమాలో కొత్త రామ్ చరణ్ ను చూడబోతున్నామన్నమాట.