సత్తాచాటిన మెగాస్టార్

Tuesday,December 20,2016 - 09:55 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో హల్ చల్ చేయాల్సిందే. పైగా ఇప్పుడు చేస్తోంది ప్రతిష్టాత్మక 150వ సినిమా. మరీ ముఖ్యంగా 9ఏళ్లు విరామం తర్వాత చేస్తున్న సినిమా. మరి అలాంటప్పుడు ఖైదీ నంబర్ 150పై అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలి. సోషల్ మీడియాలో దానిపై చర్చ ఎంతలా జరగాలి.. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇప్పటికే టీజర్ తో యూబ్యూట్ లో హల్ చల్ చేసిన చిరంజీవి… తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి సింగిల్ రిలీజ్ చేశాడు. ఆ సింగిల్ ఇలా రిలీజైందో లేదో అలా సోషల్ మీడియాను రఫ్పాడిస్తోంది. విడుదలైన జస్ట్ 24 గంటల్లోనే ఈ పాటకు ఏకంగా 20లక్షల వ్యూస్ వచ్చాయి.
khaidi-no-150-chiranjeevi-kajal-zee-cinemalu-1
ఖైదీ నంబర్-150 ఆడియో రిలీజ్ లో భాగంగా అమ్ముడు..లెట్స్ డు కుమ్ముడు అనే ఈ పాటను మొదట రిలీజ్ చేశారు. మిగతా పాటల్ని కూడా ఇదే విధంగా నెట్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వచ్చేనెల 4న విజయవాడలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఖైదీ నంబర్ 150 సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. వీవీ వినాయక్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.