మోస‌గాళ్లు షూటింగ్ నిలిపివేసిన మంచు విష్ణు

Friday,March 27,2020 - 01:49 by Z_CLU

మంచు విష్ణు ప్ర‌స్తుతం ‘మోస‌గాళ్లు’ అనే హాలీవుడ్‌-ఇండియ‌న్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయ‌న కూక‌ట్‌ప‌ల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్య‌యంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు. కరోనా కారణంగా ఇప్పుడ‌క్క‌డ ఎడారి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంతో రూపొందుతున్న ‘మోస‌గాళ్లు’ సినిమా షూటింగ్ 2019 మొద‌ట్లో ఆరంభ‌మైంది. లాస్ ఏంజెల్స్‌, హైద‌రాబాద్ ప్రాంతాల మ‌ధ్య వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటూ వ‌స్తున్న షూటింగ్ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధ చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో పూర్తిగా ఆగిపోయింది.

విష్ణుతో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి త‌దిత‌రులు పాల్గొన‌గా ప్ర‌ధాన స‌న్నివేశాలు, క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్లు దాదాపు పూర్త‌య్యాయి. అయితే, చిత్రానికి అతి కీల‌క‌మైన ఐటీ ఆఫీస్ సీన్లు.. లాక్‌డౌన్ కార‌ణంగా నిర‌వ‌ధికంగా ఆగిపోయాయి.