మరోసారి శైలజతో రామ్...

Friday,December 30,2016 - 10:35 by Z_CLU

2016ను రామ్ మరిచిపోలేడు. తెలుగు ప్రేక్షకులు కూడా మరిచిపోలేరు. ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన మొట్టమొదటి సూపర్ హిట్ నేను శైలజ సినిమా. ఆ సినిమా రామ్ కెరీర్ ను స్పీడప్ చేసింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కానీ రామ్ మనసులో మాత్రం శైలజ అలానే ఉండిపోయింది. అందుకే కుదిరితే న్యూ ఇయర్ లో మరోసారి శైలజతో సినిమా చేయాలనుకుంటున్నాడు.

nenu_sailaja_movie_photos-zee-cinemalu-ram-keerthy-2

నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అదే మూవీతో కిషోర్ తిరుమల కూడా దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. 2017లో కుదిరితే కిషోర్ తిరుమలతో మరో సినిమా చేయాలనుకుంటున్నాడు రామ్. ఆ సినిమాలో కూడా కీర్తి సురేశ్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నఈ ప్రాజెక్టుపై జనవరి ఎండింగ్ లో పూర్తి క్లారిటీ వస్తుంది.