కుమ్ముడు సాంగ్ నిజంగానే కుమ్మేస్తోంది...

Friday,December 30,2016 - 11:25 by Z_CLU

సాంగ్స్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ది బెస్ట్ సాంగ్ నే మొదట విడుదల చేస్తారు. అయితే అది బెస్ట్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఖైదీ నంబర్-150 సినిమాకు సంబంధించి కూడా ఇలానే ఆడియో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు.. మొదట ఏ సాాంగ్ ను నెట్ లో రిలీజ్ చేయాలా అని చాలా రోజులు ఆలోచించారు. ఫైనల్ గా అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు సాంగ్ ను విడుదల చేశారు. మేకర్స్ డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని రుజువైంది. అమ్మడు సాంగ్ నిజంగానే యూట్యూబ్ లో కుమ్మేస్తోంది. ఇప్పటివరకు ఈ ఒక్క సింగిల్ కే 70 లక్షల వ్యూస్ వచ్చాయి.

khaidi-no-150-chiranjeevi-kajal-zee-cinemalu

ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమా పాటలకు మాత్రమే ఈ రేంజ్ లో వ్యూస్ వచ్చేవి. ఇప్పుడా భ్రమల్ని మెగాస్టార్ పటాపంచలు చేశాడు. ఇదే ఊపులో జనవరి 4న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఈవెంట్ కు అందరూ వచ్చి ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని ఓ స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్ కు వెల్ కం చెప్పాడు ఖైదీ నంబర్-150 నిర్మాత రామ్ చరణ్.