ఖైదీ నంబర్-150 ఐటెంసాంగ్ రిలీజ్

Friday,December 30,2016 - 09:30 by Z_CLU

దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన దాదాపు ఐటెంసాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. అసలు దేవిశ్రీ అంటేనేే ఐటెంసాంగ్స్ స్పెషలిస్ట్. మరి అలాంటి మ్యూజిక్ డైరక్టర్, మాస్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఐటెంసాంగ్ కంపోజ్ చేయాలంటే ఇంకెంత కేర్ తీసుకుంటాడు. అలా ఫుల్ కేర్ తీసుకొని కంపోజ్ చేసిన పాటే రత్తాలు..రత్తాలు. మోస్ట్ ఎవెయిటింగ్ సింగిల్ గా పేరుతెచ్చుకున్న ఈ పాటను రేపు విడుదల చేయబోతున్నారు.

కేవలం కంపోజిషన్ లోనే కాదు, పిక్చరైజేషన్ లో కూడా రత్తాలు..రత్తాలు సాంగ్ సెన్సేషన్ సృష్టించింది. ఈ పాట కోసం మొదట క్యాథరీన్ థ్రెసాను అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆమెను తప్పించి, లక్ష్మీరాయ్ ను తీసుకున్నారు. అప్పట్లో అది పెద్ద సంచలనం అయింది. అంతేకాదు.. ఈ పాట కోసం రామోజీ ఫిలింసిటీలో లావిష్ సెట్ వేశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ స్పెషల్ సాంగ్.. డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ ను మరింత పెంచే విధంగా ధూమ్ ధామ్ గా విడుదలకానుంది.