డిఫెరెంట్ గా లాంచ్ కానున్న రామ్ కొత్త సినిమా

Tuesday,March 28,2017 - 05:24 by Z_CLU

జస్ట్ సినిమాని కొత్తగా ప్రెజెంట్ చేయడమే కాదు… సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని కూడా కొత్తగా ప్రెజెంట్ చేయడమే కాన్సెప్ట్ గా పెట్టుకున్నట్టున్నాడు రామ్.  అందుకే తన నెక్స్ట్ సినిమా లాంచ్ ఈవెంట్ ని, ఫ్యాన్స్ లైవ్ లో చూసే ఏర్పాట్లు చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్.

కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కనున్న తన నెక్స్ట్ సినిమా ఈ ఉగాదికి లాంచ్ కానుంది. అయితే ఈ వేడుకలను యూ ట్యూబ్ లో లైవ్ లో ప్రసారం చేయనున్న సినిమా యూనిట్, రేపు మార్నింగ్ 10 : 25 కి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

గ్రాండ్ గా జరగనున్న ఈ సినిమా లాంచ్ తరవాత ఫ్యాన్స్ తో లైవ్ చాట్ చేయనున్న రామ్, ఈ సినిమాకి సంబంధించిన ఎగ్జైటెడ్ అప్ డేట్స్ ని ఫ్యాన్స్ తో డిస్కస్ చేయనున్నాడు.  ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.