బెస్ట్ మూవీస్ ఆఫ్ అల్లు అర్జున్

Tuesday,March 28,2017 - 04:13 by Z_CLU

అల్లు అర్జున్ తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయి సరిగ్గా పద్నాలుగేళ్ళు. ఒక్కో సినిమాతో ఒక్కో స్టెప్పు ఎదుగుతూ.. తన యూనిక్ స్టైల్ తో హై ఎండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ తన కరియర్ ని జస్ట్ మాస్ సినిమాలతోనే కాదు, డిఫెరెంట్ సినిమాలతో ప్లాన్ చేసుకుంటూ స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.

గంగోత్రి : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన అల్లు అర్జున్, ఫస్ట్ అటెంప్ట్ లోనే తన పర్ఫామెన్స్ తో ఎట్రాక్ట్ చేశాడు.

ఆర్య : ఆలు అర్జున్ కరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ట్యాగ్ కి పర్ ఫెక్ట్ గా క్వాలిఫై అయింది ఈ సినిమాతోనే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, బన్నిని అటు క్లాస్, మాస్ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది.

దేశముదురు :  బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ మాస్ ఎంటర్ టైనర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ తో కనిపించి ఎట్రాక్ట్ చేశాడు అల్లు అర్జున్.

వేదం : అప్పటికే మాస్ అప్పీల్ ని బ్యాగ్ లో వేసుకున్న బన్ని ‘వేదం’ లాంటి సినిమాలో చేయడం నిజంగా పెద్ద ప్రయోగమే. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ ని డిఫెరెంట్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేసింది.

రేస్ గుర్రం : అల్లు అర్జున్ కరియర్ లో బిగ్గెస్ట్ హిట్. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ లాంటి  మ్యాగ్జిమం కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, అల్లు అర్జున్ కరియర్ లో అప్పటికే క్రియేట్ అయి ఉన్న మ్యాగ్జిమం రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది.

సరైనోడు : అల్లు అర్జున్ తన కరియర్ లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. సరైనోడు క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ ఒక ఎత్తు. బన్ని కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిన ఈ సినిమా, తనలోని ఊరమాస్ ఆంగిల్ ని పర్ ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసింది.

14 ఏళ్ల క్రితం టాలీవుడ్ జర్నీ బిగిన్ చేసిన స్టైలిష్ స్టార్ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ, ఫ్యాన్స్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. బన్ని ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ, మరెన్నో హిట్స్ కి రీచ్ అవ్వాలని, ఫ్యాన్స్ ని ఇలా ఎప్పటికీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.