సమ్మర్ లో రానున్న వైశాఖం

Tuesday,March 28,2017 - 06:06 by Z_CLU

జయ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘వైశాఖం’ ఈ సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ఆడియో, ఆల్ రెడీ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. దానికి తోడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ట్రేలర్స్ సినిమా పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.

B.A. రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జయ కరియర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిపోయిన ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ తరహా సినిమాగా ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వడం ఖాయమని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి D.J. వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.