ఫిబ్రవరి నుండి రామ్ కొత్త సినిమా

Wednesday,November 29,2017 - 01:17 by Z_CLU

‘ఉన్నది ఒకటే జిందగీ’ మూవీ సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న రామ్ కొత్త సినిమా ఫిబ్రవరి నుండి బిగిన్ కానుంది. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకున్న రామ్, ఈ సారి అవుట్ అండ్ అవుట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

‘నేను లోకల్’ లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన నటించబోయే హీరోయిన్ తో పాటు, తక్కిన టెక్నీషియన్ వివరాలను త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.