అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది

Wednesday,November 29,2017 - 12:18 by Z_CLU

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా లాంటి డీసెంట్ హిట్ తరవాత మరో లవ్ ఎంటర్ టైనర్ ‘ ఒక్కక్షణం’ తో రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. అటు యాక్షన్, ఇటు ఇమోషన్ ని బ్యాలన్స్ చేస్తూ V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసింది. దానికి తోడు ఈ రోజు రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మూవీ స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.

సినిమా లాంచ్ చేసిన రోజే ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ అని క్లారిటీ ఇచ్చిన సినిమా యూనిట్, ఫస్ట్ లుక్ తో ‘లవ్ VS డెస్టినీ’ అనే క్యాప్షన్ తో ఎట్రాక్ట్ చేసింది. ఫస్ట్ లుక్ ని బట్టి, ట్యాగ్ లైన్ రివీల్ చేస్తున్న కాన్సెప్ట్ ని బట్టి, టాలీవుడ్  రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే, ఈ మూవీ డెఫ్ఫినేట్ గా డిఫెరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

 

అల్లు శిరీష్ సరసన సురభి జోడీ కట్టిన ఈ సినిమాని చక్రి చిగురుపాటి నిర్మించాడు. శ్రీనివాస్ అవసరాల కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజర్.