ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేసిన కొరటాల శివ

Friday,October 06,2017 - 12:49 by Z_CLU

మహేష్ బాబు కొరటాల మూవీ ఫుల్ స్వింగ్ లో ఉంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత వస్తున్న ఈ కాంబో పై ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. అయితే ఈ లోపు ఈ మూవీ స్టిల్ లీకయిందనే న్యూస్ టాలీవుడ్ లో ఒక్కసారిగా వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

మహేష్ బాబు ఈ సినిమాలో చీఫ్ మినిస్టర్ లా కనిపించనున్నాడు. అయితే ఈ స్టిల్ ఎలా లీకయింది..? లాంటి విషయాలు ఇంకా  తెలియలేదు  కానీ, ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న కొరటాల మాత్రం, ఈ స్టిల్ ని దయచేసి సర్క్యులేట్ చేయవద్దని, అటు మీడియాని, ఇటు ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాతో కైరా అద్వానీ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ కానుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జనవరి 11, 2018 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.