జీ సినిమాలు ( మార్చి 21st)

Monday,March 20,2017 - 10:08 by Z_CLU

నటీనటులు : నాగార్జున, అమల

ఇతర నటీ నటులు: రావు గోపాల రావు, మోహన్ బాబు, మురళి మోహన్, నూతన్ ప్రసాద్, శివ కృష్ణ, శుభలేఖ సుధాకర్, చలపతి రావు, సుత్తివేలు, బ్రహ్మానందం, గుండు హనుమంత రావు.

మ్యూజిక్ డైరెక్టర్  : చక్రవర్తి

డైరెక్టర్ : A. మోహన్ గాంధీ

నిర్మాత : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1988 మే 6

నాగార్జున, అమల నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ చినబాబు. తన స్నేహితులను చంపిన దొంగల ముఠాను ఒక యువకుడు ఎలా తుదముట్టించాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. నాగార్జున, అమల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

నటీనటులు : నరేష్, దివ్యవాణి

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సంగీత, A.V.S. సుబ్రహ్మణ్యం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబు మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : ముళ్ళపూడి వెంకట రమణ

రిలీజ్ డేట్ : 1994

బాపు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన అద్భుత దృశ్య కావ్యం పెళ్ళి కొడుకు. మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే ధృడ నిశ్చయంతో ఇంట్లోంచి బయటికి వచ్చిన యువకుడి కథే పెళ్ళికొడుకు. ఆ తరవాత ఏం జరిగింది..? తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగిందా లేదా అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్

ఇతర నటీ నటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాత : రామానాయుడు

దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు..

============================================================================

నటీనటులు : పృథ్విరాజ్ సుకుమారన్, ప్రభుదేవా, ఆర్య, జెనీలియా డిసౌజా, నిత్యా మీనన్

ఇతర నటీనటులు : ఆలెక్స్ ఓ’నీల్, రాబిన్ ప్రాట్, ఆమోల్ గుప్తే, అంకుర్ ఖన్నా, జగతి శ్రీకుమార్, షాజీ నాడేసన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దీపక్ దేవ్

డైరెక్టర్ :  సంతోష్ శివన్

ప్రొడ్యూసర్ : సాజీ నాడేసన్

రిలీజ్ డేట్ : 31st మార్చి 2011

కొన్ని వాస్తవాలు, మరికొన్ని కల్పిత కథల ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ సినిమా ఉరుమి. 16 వ సెంచరీ నేపథ్యంలో పోర్చుగీస్ ఆధీనంలో ఇండియన్ సముద్రం ఉన్నప్పటి వాస్తవ కథలకు మరింత ఫిక్షన్ జోడించి ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిందే ఉరుమి. నటీనటుల న్యాచురం పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

=========================================================================

హీరోహీరోయిన్లు – చంద్రమోహన్, శ్రీదేవి

నటీనటులు – మోహన్ బాబు, నిర్మలమ్మ

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల – 1978, ఆగస్ట్ 31

అతిలోకసుందరిని టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా పదహారేళ్ల వయసు. అప్పటికే తమిళనాట సూపర్ హిట్  అయిన 16-వయతనిళ్లే సినిమాకు  రీమేక్ గా ఇది తెరకెక్కింది. తమిళ్ లో ఈ సినిమాను కె.బాలచందర్ తీశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. రెండు భాషల్లో శ్రీదేవే లీడ్ రోల్ చేశారు. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్ పాత్రను చంద్రమోహన్ పోషించారు. అంతకంటే ముందు కమల్ హాసన్ పోషించిన పాత్రను శోభన్ బాబుకు, శ్రీదేవి క్యారెక్టర్ కోసం జయప్రదను అనుకున్నారు. కానీ వాళ్లిద్దరు బిజీగా ఉండడంతో చంద్రమోహన్-శ్రీదేవి ని ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు.

చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలెట్. సిరిమల్లెపువ్వా అనే సాంగ్ ఇప్పటికీ హిట్టే. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ… తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ మార్చారు. తమిళ్ క్లయిమాక్స్ లో శ్రీదేవి రైల్వేస్టేషన్ లో ఒంటరిగా మిగిలిపోయినట్టు చూపించారు. కానీ తెలుగు క్లయిమాక్స్ లో మాత్రం చంద్రమోహన్ రాకతో సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.

===========================================================================

నటీనటులు : నందమూరి తారక రామారావు, సావిత్రి

ఇతర నటీనటులు : S.V. రంగారావు, కాంతారావు, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వర రావు, బాలయ్య, పద్మనాభం, మిక్కిలినేని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటసాల

డైరెక్టర్ :  కమలాకర కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : అడుసుమిల్లి ఆంజనేయులు

రిలీజ్ డేట్ : 14 జనవరి 1965

నందమూరి తారక రామారావు, సావిత్రి, S.V. రంగారావు నటించిన అద్భుత మైథలాజికల్ చిత్రం పాండవ వనవాసం. కమలాకర కామేశ్వర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాని అడుసుమిల్లి ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హైలెట్ గా నిలిచింది.