చరణ్ మెగాస్టారే కదా -అల్లు అర్జున్

Tuesday,August 23,2016 - 07:27 by Z_CLU

 

రామ్ చరణ్ ను మెగా స్టార్ అంటూ సంబోధించాడు అల్లు అర్జున్. మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి జన్మదిన వేడుకను నిర్వహించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ వేడుకకు భారీ ఎత్తున మెగా అభిమానులు హజారయ్యారు. ఈ వేడుకలో నాగ బాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్,వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ లు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకకి మెగా స్టార్ రాక పోవడం తో రామ్ చరణ్ మాట్లాడుతుండగా ఒక్క సారిగా వి వాంట్ మెగా స్టార్ అంటూ గట్టి గా అరిచారు మెగా ఫాన్స్. ఈ మాట విని వెంటనే వేదిక పై కి వచ్చిన అల్లు అర్జున్ ఎందుకు వి వాంట్ మెగా స్టార్ అని అరుస్తున్నారు. రామ్ చరణ్ కూడా మెగా స్టార్ కదా అంటూ జవాబిచ్చాడు . ఆ మాట కు థాంక్స్ బన్నీ అంటూనే నాకంత సీను లేదు అంటూ నవ్వుతూ చెప్పాడు చెర్రీ. ఈ మాటలు మెగా అభిమానులను ఒక్కసారిగా ఫిదా అయిపోయారు.