డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సందీప్ కిషన్ కొత్త సినిమా

Saturday,November 24,2018 - 11:02 by Z_CLU

సందీప్ కిషన్ కొత్త సినిమా ‘నిను వీడని నేనే’ ఫస్ట్ లుక్ రిలీజయింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ నిర్మాతగా మారాడు. సూపర్ న్యాచురల్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తీక్ రాజు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

ఫస్ట్ లుక్ తోనే డెఫ్ఫినేట్ గా డిఫెరెంట్ సినిమా అనిపించుకుంటుంది ‘నిను వీడని నీడను నేనే’. అద్దంలో తన ప్రతిబింబానికి బదులు అమ్మాయి కనిపిస్తుండటంతో సందీప్ కిషన్ ఈ సారి, పవర్ ఫుల్ ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరో 5 రోజుల షూటింగ్ తరవాత కంప్లీట్ గా షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్న ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు. సందీప్ కిషన్ తో పాటు దయా పన్నెం ఈ సినిమాకి సహ నిర్మాత. అన్య సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.