Venkatesh Nani - వీళ్లు కూడా సెట్స్ పైకి
Friday,July 02,2021 - 11:27 by Z_CLU
టాలీవుడ్ లో షూటింగ్స్ మరింత ఊపందుకున్నాయి. మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ అన్నీ ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా మరో 3 క్రేజీ ప్రాజెక్టులు మొదలయ్యాయి.

F3
మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ F3 సెట్స్ పైకొచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్2కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్న, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. హీరోయిన్ అంజలి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

Shyam Singha Roy
నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కూడా సెట్స్ పైకొచ్చింది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన వింటేజ్ కోల్ కతా సెట్ లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. తన సినిమా కొత్త షెడ్యూల్ మొదలైన విషయాన్ని నాని స్వయంగా వెల్లడించాడు. నిజానికి ఈ సినిమా కోసం లాక్ డౌన్ కు ముందే 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ వేశారు. కానీ వర్షాలకు అది పాడైపోయింది. దాన్ని బాగుచేసి, మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali
సుధీర్ బాబు కూడా సెట్స్ పైకొచ్చాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కృతిషెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా సెట్స్ పైకొచ్చింది.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics