F3 Movie - మళ్లీ మొదలు పెట్టారు!

Friday,July 02,2021 - 12:38 by Z_CLU

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న F3 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కరోన సెకండ్ ఎఫెక్ట్ తో వాయిదా పడిన షూటింగ్ నిన్నటి నుండి మొదలైంది. వీలైనంత ఫాస్ట్ గా షూట్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. నిన్న దుర్గం చెరువు సమీపంలో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన యూనిట్ ఈరోజు ఓ షాపింగ్ లో కొన్ని సీన్స్ తీస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇదే ఫైనల్ షెడ్యుల్. దీంతో టోటల్ షూట్ కి ప్యాకప్ చెప్పనున్నారు.

వెంకీ , వరుణ్ హీరోలుగా అనిల్ తీసిన F2 రెండేళ్ళ క్రితం సంక్రాంతి కి వచ్చి ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ , వరుణ్ లతో పాటు ఈసారి సునీల్ కూడా యాడ్ అయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్ తో సునీల్ మళ్ళీ ఒకప్పటి రోజులు గుర్తుచేస్తాడని అంటున్నారు. హోటల్ బిజినెస్ తో ఫన్, ఫ్రస్ట్రేషన్ ఎలిమెంట్స్ తో పాటు ఫైనాన్స్ ఇబ్బందులతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో F2 టైప్ లోనే బోలెడు ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. సినిమాలో ఐటెం సాంగ్ తో పాటు గెస్ట్ రోల్స్ కూడా ఉంటాయని ఇన్సైడ్ టాక్. మరి కరోన ఎఫెక్ట్ తో రెండేళ్లుగా కష్టాలతో కాలం వెల్లగొడుతున్న ప్రేక్షకులకు ఈ సినిమా కామెడీతో మంచి రిలీఫ్ అందిస్తుందని, రెండేళ్ళ కష్టాన్ని రెండు గంటలు మరిచిపోయేలా సినిమా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అనిల్.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics